సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో దళిత సమాజోద్ధారకుడు భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ది టీ బాల నర్సు ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్ హాజరై చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ “దళిత వైతాళికుడిగా: ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కర్తగా,ఆది ఆంధ్ర సభ స్థాపకుడిగా 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడని.” జగన్ మిత్ర మండలి”, సంఘ సంస్కరణ నాటక మండలి “, అహింసా సమాజాలను స్థాపించి హైదరాబాద్ ప్రాంతంలో సంఘసంస్కరణకై కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా కోఆర్డినేటర్ ఉప్పులేటిబాబు, స్వేరో జిల్లా అధ్యక్షుడు బొర్ర సురేష్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు వడ్లూరి పరుశరాములు, జంగిటి శంకర్, లింగాల శ్రీనివాస్, తాడిచెట్టి అనిల్, మేకల మహేష్, ఏనుగుల యాదగిరి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.