దేశప్రజల రక్షణ కోసం మనువాద, కార్పొరేట్, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన గుంటూరులో జరగనున్న”భారత్ బచావో” సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పిడుగురాళ్ల తాసిల్దార్ కార్యాలయము వద్ద కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి పార్టీ తిరోగమాన విధానాలను అవలంబిస్తూ దేశ ప్రజలను పీకలలోతు కష్టాల్లోకి నెట్టివేస్తుంది దేశభక్తి జాతీయత పేరుతో దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మరోవైపు ఆదాని లాంటి బడా దళారీ పెట్టుబడిదారులకు దేశ సంపదలను దోచిపెడుతున్నారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతుంటే పోరాడే ప్రజలపై ముప్పేట దాడులకు బిజెపి పార్టీ పాల్పడుతుంది మైనార్టీలపై దళితులపై ఆదివాసులపై దాడులు అయ్యాయి దీనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఐక్యంగా ఉద్యమించి బిజెపి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కర్తవ్యం నేడు మన ముందర ఉన్నది ఈ సందర్భంలో దేశంలో ఉన్న బిజెపేతర రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు దళిత ముస్లిం మైనార్టీలు ,రాజకీయ పార్టీలు , వామపక్ష పార్టీలు ప్రజాస్వామిక వాదులు , “భారత్ బచావో” సదస్సులో భాగస్వాములై బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు, పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, ఎం సి పి ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి అబ్రహం లింకన్, ఎం సి పి ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు కృష్ణ, సిపిఐ పిడుగురాళ్ల పట్టణ కార్యదర్శి కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.