కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో రాయలసీమ జోన్ సీఈవో అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులకు ఆదివాసుల వేషదారణలు ధరించి, ఆదివాసులు మాదిరిగా ఆటలు అడారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ ఆదివాసుల జీవన విధానం, వారి కట్టుబాట్లు, కట్టుబట్ట ఎలా ఉంటుందో విద్యార్థులకు వేయించి వారికి తెలియచేయటం జరిగిందని చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఆదివాసుల్లో మార్పులు వస్తున్నాయని, వారు కూడ విద్యవైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఇంకా వారి జీవన విధానంలో మార్పులు వచ్చి వారి పిల్లలను బాగ చదించాలని పేర్కొన్నారు. చిన్నారులు ధరించిన అదివాసుల వేషధారణలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠవాల అధ్యాపక బృందం, అద్యాపకేతర బృందం, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.