పల్నాడు జిల్లా: చిలకలూరిపేట పట్టణంలోని కేబీ రోడ్డులో వెంకటేశ్వర థియేటర్ ఎదురు సమీప ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
భాష్యం స్కూలు బస్సు పురుషోత్తమపట్నం అడ్డ రోడ్డు వైపు నుంచి తహసీల్దార్ కార్యాలయం వైపు వెళుతోంది.
ఈ క్రమంలో ద్విచక్రవాహనం పై వస్తున్న యువకుడు బస్సు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
అయితే సదరు యువకుడి వద్ద సూసైడ్ లెటర్ ఉండటం ఈ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది.
లెటర్ ప్రకారం సదరు యువకుడు చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామం మసీద్ బజారు కు చెందిన షేక్ అబ్దుల్ కరీంగా తెలుస్తోంది.
తాను పట్టణంలోని ఒక కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు.. తన చావుకి కొంతమంది కారణమని ఆ లేఖలో రాసి ఉంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సమయంలో చిలకలూరిపేట 108 సిబ్బంది అటుగా వెళుతూ మానవతా దృక్పథంతో వాహనాన్ని ఆపి పరిశీలించగా అప్పటికే యువకుడు మృతి చెంది ఉండడంతో వారు వెనుదిరిగి వెళ్లారు…!!