నిజామాబాద్ జిల్లా -భీంగల్ మండలం ;సికింద్రపుర్ గ్రామంలో సొసైటీ ముందు రైతుల ఆందోళన చేపట్టారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సికింద్రాపూర్ గోదాంకు సంబంధించిన ఇంచార్జ్ ను ప్రశ్నించగా సంచికి రెండు రూపాయలు ఇవ్వకపోవడంతో లారీలు వస్తలేవు లారీలు రాక కొనుగోలు కేంద్రం నిలిపివేశారని, హమాలి డబ్బులు 35 రూపాయలు ఇవ్వగా అదనంగా సంచికి మరో 2 రూపాలు వసూలు చేస్తున్నారన్న రైతులు ఆవేదన వ్యక్తం చేసారు, సొసైటీ వైస్ చైర్మన్ కు తెలుపగా సమాధానం చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయనిరైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రెండు రోజుల్లో కొనుగోలు పూర్తి చేయాలనీ లేనియెడల నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా ధర్నా చేస్తామని హెచ్చరించారు.
