అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి : దేవరాపల్లి మండలంలోని వలసకూలిలు,మాయమైపొతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పెర్కోన్నారు. ఈ సందర్బంగా అయన ఓప్రకటన విడుదల చేశారు. ప్రతి సంవత్సరం పిబ్రవరి, మార్చి నేలలో గుడివాడ ఎలూరు మచిలీపట్నం ప్రాంతానికి గిరిజన యువకులు మీనపచేలు పనులకు వలసలు వెళ్తున్నారని ఇందులో కోంత మంది యువకులు మాయ మైపోవడం పరిపాటుగా మారి పోతుందని తెలిపారు. ఈసంవత్సరం కూడా దేవరాపల్లి మండలంని చింతలపూడి పంచాయతీ చివారు వీరబద్రిపేటకు చేందిన తామార్ల కోండబాబు,(20) సం గర్సింగి పంచాయతీ చివారు ఎలాం బైలకు చేందిన బోర్రబొయిన అప్పారావు (20) సం ,ఇరవై రోజులు క్రితం వలస వెళ్ళారని తెలిపారు వీరు ఇద్దరు వేరు వేరు ప్రాంతాలకు పనికి వెళ్ళగా తిరిగి వచ్చే మార్గంలో కుటుంబికులు ఇచ్చిన సమాచారం మేరకు అనకాపల్లి లో ఒకరు బీమవరంలో ఒకరు కని పించకుండా పోయారని చేబుతున్నారని తెలిపారు. వీరి అచూకి కోసం అనకాపల్లి బీమవరం పోలీసు స్టేషన్ లో తల్లి దండ్రులు పిర్యాదు చేయడం జరిందన్నారు అయిన ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. వీరికోసం తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా ఎడుస్తున్నారని తెలిపారు గిరిజనులు అవ్వడం వలన అదికారులు కూడా ఎవ్వరు పట్టించ కోవడం లెదని తెలిపారు. యువకులు కనిపించకుండా పోవడం వెనుక ఎదో కుట్ర జరుగుతుందని దీనిపై పోలీసు వారు సరియైన నిఘాను ఎర్పాటు చేసి మాయమై పోయిన యువకులు అచూకి కోరకు సహాయం చేసి తల్లి తండ్రులు కుటుంబాలకు సహాయం చేయాలని వెంకన్న అప్రకటనలో కోరారు.