రాజన్న సిరిసిల్ల జిల్లా : బోయినపల్లి మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకున్నది. శభాష్‌పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నది. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
