కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని ఇటీవల వర్షాలతో చొక్కారావుపల్లె బిక్కు వాగు పై భారీ వరద నీరు పోవడంతో పిచ్చి మొక్కలు, చెత్తచెదరం పైపుల్లో చిక్కుకుంది. గురువారం చొక్కారావుపల్లె గ్రామ సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి చూసి వెంటనే స్పందించి జెసిబి సహాయంతో చెత్తను తొలగించారు.చోక్కారావుపల్లె, పుత్తూరు గ్రామాల రైతులు ప్రజలు, పలువురు, వాహనదారులు, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి ని అభినందించారు.
