అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం: గ్రామీణ ఉపాధి హమి చట్టంలో పనిచేస్తున్నకూలికు పెద్ద కష్టం చిన్న కూలి ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. సోమవారం మండలంలో పలు ప్రాంతాల్లో ఉపాధి కూలీలు పనులు చేస్తున్న చోట పర్యాటించారు అనంతరం అయిన మాట్లాడుతూ…మండుటెండలో ఉపాధి కూలీలు పని చేస్తూ పని ప్రదేశంలో నేల కాడక దూర ప్రాంతాలు నుండి నీళ్ళు మోసుకోచ్చి పని చేస్తూన్నారని తెలిపారు, బడ్జెట్లో పూర్తిగా నిదులు తగ్గించడం డబ్బులు గిట్టుబాటు కాకుండా చేసి కూలిలే ఈపనులు మాకువద్దు అనే విదంగా చేస్తుందని తెలిపారు, వెంటనే ఈ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, సమ్మర్ ఎలవెన్స్ 40 రూపాయలు ఇవ్వాలని,మేట్లుకు సేల్ ఫోన్లు పారితోషకం ఇవ్వాలని, మంచి నీళ్ళు,తట్ట,గునపాం, పారకు డబ్బులు ఇవ్వాలని, ట్రావిలింగ్ ఎలవెన్స్ ఇవ్వాలని, ఫేసిప్పులు పనిముట్లు మేడికల్ కిట్లు టెంట్లు ఇవ్వాలని, బడ్జెట్ లో నిధుల పెంచాలని, 200 రోజులు పని 600 కూలి ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న భకాయిలు వెంటనే చేల్లించాలి డిమాండ్లు పరిష్కారం చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని పటింగా అమలు చేయాలని కోరారు.