కరీంనగర్ జిల్లా : బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ శ్రీమతి మ్యాకల దివ్య నాగరాజు, మాజీ సర్పంచ్ గుండారం (మ్యాకల) రాజయ్య మరియు దాచారం,రాంసాగర్, బెజ్జంకి అనుబంధ గ్రామం ఎల్లంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారి సమక్షంలో పార్టీ లో చేరారు. వారికి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.