సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలం లోని పలు గ్రామాలలో మానకొండూర్ ఎమ్మెల్యే రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ పుట్టినరోజు వేడుకలను కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మండలంలోని బేగంపేటలో టిఆర్ఎస్ నాయకులు, రసమయి అభిమానుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా బాణసంచా పేల్చి కేక్ కట్ చేసిన అనంతరం టిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది మళ్లీ బి. ఆర్.ఎస్ ప్రభుత్వమే అని రానున్న ఎన్నికలలో రసమయి అన్న భారీ మెజార్టీతో గెలిచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ చింతల పెల్లి రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు ఐల పాపయ్య, బి.ఆర్.ఎస్, గ్రామ శాఖఅధ్యక్షుడుమామిడాల లక్ష్మణ్, నాయకులు పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి ఎలశేఖర్ బాబు, పార్టీ అభిమానులుగొడుగు కనకయ్య, పున్నం రాజేశం, బెజ్జంకి పోచయ్య, రాజేందర్, ధనుర్బాన్, కొరివి కనకయ్య, పిట్టల పోచమల్లు, గోలి కిష్టయ్య, దుబ్బుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
