తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు జరిగిన పత్రిక సమావేశంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడ వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘రుణమాఫీ అనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే సహాయం చేస్తోందని, పల్లెలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే 100% రుణమాఫీ చేయడం జరిగిందని, రైతుల ఆవేదన మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన చెందారు.
ఇకనైనా ప్రభుత్వం తీరుమార్చుకోవాలని, లేదంటే రైతులతో ధర్నాకి దిగుతామని హెచ్చెరించారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు గౌరవల్ల రాములు, సాయి తేజ పాల్గొన్నారు.