contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Karimnagar Dist : బీజేపీ సంబరాలు

  • పైస‌లు పంచిన కాంగ్రెస్ గెల్వ‌లే
  •  బీజేపీకి పెరుగుతోన్న మ‌ద్ద‌తు..
  •  అభివృద్ధికే ప‌ట్టం గ‌ట్టిన ప్ర‌జ‌లు
  •  ఎమ్మెల్సీల గెలుపుతో బీజేపీ నేత‌ల సంబ‌రాలు
  •  రాబోయేది బీజేపీ రాజ్య‌మే..
  •  మండ‌ల అధ్య‌క్షుడు తిప్ప‌ర్తి నికేష్‌

కరీంనగర్ జిల్లా: క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెద‌క్ ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు మార్పుకు సంకేత‌మ‌ని, రాబోయేది బీజేపీ రాజ్య‌మేన‌ని బీజేపీ మండ‌ల అధ్య‌క్షుడు తిప్ప‌ర్తి నికేష్ అన్నారు. గురువారం బీజేపీ అభ్య‌ర్థుల గెలుపుపై మండ‌ల కేంద్రంలో నికేష్ ఆధ్వ‌ర్యంలో బీజేపీ నేత‌లు బాణాసంచా కాల్చి మిటాయిలు పంచి సంబ‌రాలు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా తిప్ప‌ర్తి నికేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు కాంగ్రెస్ పార్టీని న‌మ్మ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వం పై ఉన్న ప్రజావ్య‌తిరేక‌త‌తోనే బీజేపీకి మ‌ద్ద‌తిచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ డ‌బ్బులతో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టినా, ఓటుకు రూ. 5వేలు పంచినా జ‌నం న‌మ్మ‌లేద‌ని, దేశం కోసం ధ‌ర్మం కోసం పనిచేసినా బీజేపీ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించార‌న్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతోంద‌ని జ‌నం మరోసారి రుజువు చేశార‌ని నికేష్ పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ బ‌లోపేత‌మ‌వుతోంద‌న్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో బీజేపీ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ హావా కొనసాగుతోంద‌ని, మోడీ నాయ‌క‌త్వంపై ప్ర‌జ‌లు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, గుంటుక శంకర్, సామ రాజిరెడ్డి,పుల్లెల రాము, బండి తిరుపతి, రామచంద్రం, పంబాల రాజశేఖర్, బోడ భాస్కర్ రెడ్డి, నందికొండ సురేందర్ రెడ్డి,అరికాంతం అనిల్ రెడ్డి, గుమ్మడి సురేందర్ రెడ్డి, రాజిరెడ్డి, అభిలాష్, గణేష్, అనుమండ్ల రాజిరెడ్డి, బలరాం రెడ్డి, అనంతరెడ్డి, చంద్రారెడ్డి, ప్రశాంత్, బోయిని వేణు, సంతోష్, భూమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :