వరికపూడిసెల నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు లేకుండా , టెండర్లు పిలవకుండా పనులకు శంకుస్థాపన చేయాలనుకోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే చెళ్లింది. బుగ్గ వాగు నుండి మాచర్ల పట్టణానికి సంబంధించిన త్రాగు నీటి పథకానికి శంకుస్థాపన చేసి 10 నెలలు దాటిన ఇంతవరకు పనులు ప్రారంభించలేని మీరు యే ముఖం పెట్టుకొని మాచర్ల కు వస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు యాదవ్ అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారు మీ మాయమాటలు మాచెర్ల ప్రజలు నమ్మే స్థితిలో లేరు , ఎన్నికల ముందు మీరు చేసే శంకుస్థాపనకు విలువ లేదు , కేవలం మీ ప్రభుత్వ అలసత్వం కారణంగానే అటవీ శాఖ అనుమతులు ఆలస్యం అయ్యింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
వరికపూడిసెల పై ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి కి వ్యతిరేకంగా బిజెపి నిరసన తెలియ చేస్తుంది అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మాచర్ల అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి నాసరయ్యా , OBC మోర్చ్ బాపట్ల ఇంఛార్జి శెట్టి హనుమంతరావు , జిల్లా ST మోర్చ అధ్యక్షులు విజయ్ కుమార్, మాచర్ల పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతి కుమార్, దుర్గి మండల అధ్యక్షులు వెలిదిండి శ్రీనివాసరావు , జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు , మాచర్ల అసెంబ్లీ SC మోర్చ ఇంఛార్జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.