సంగారెడ్డి, అమీన్ పూర్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రథసారధి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి సూచన మేరకు జూలై 9 తేదీన అమీన్పూర్ మండల్ తాసిల్దార్ అమీన్పూర్ కి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో వినిత పత్రం ఇవ్వడం జరిగింది. యొక్క కార్యక్రమం అమీన్పూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ మరియు కిసాన్ మోర్చా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆదెలి రవీందర్. సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి. అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు రాజు ముదిరాజ్లు మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమీన్పూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ స్థానిక మండల తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్ గోరికాడి శ్రీకాంత్ సీనియర్ నాయకులు అంజిరెడ్డి. శ్రీహరి. మహేందర్. బూత్ అధ్యక్షులు కృష్ణా గౌడ్ రాజేందర్ రెడ్డి .కుమార్. రాజేందర్ బూతు ప్రధాన కార్యదర్శులు రొయ్యల వెంకటేష్. వీరాంజనేయులు. మరియు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.. భారతీయ జనతా పార్టీ డిమాండ్స్ ..
1) కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలి.
2) కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా క్రింద ఖరీఫ్ రబీ కలుపుకొని 15 వేల రూపాయల ఆర్ధిక తోడుపాటును అందించాలి
3) కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలి.
4) వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 సంవత్సరానికి వెంటనే అమలు చేయాలి
5) తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలి కోరుచున్నాము…