- ఆదివాసీ బిడ్డలను గోండి తెగగా గుర్తించాలి
- ఆదివాసీల జీవన విధానాన్ని చిందిలం చేస్తున్న తెరాస ప్రభుత్వ విధానాలపై పోరు
- భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీష్ కుమార్
ఐదు దశాబ్దాలుగా తెలంగాణలో జీవనం సాగిస్తున్న ఆదివాసి బిడ్డలను గోండి తెగగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. చర్లలో ఆదివారం గిరిజన నాయకుడు నక్కా కన్నారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఐదోవ షెడ్యూల్ ప్రాంతం నుండి ఐదవషెడ్యూల్ ప్రాంతమైన చర్ల మండలంలో గత 52 సంవత్సరలుగా వచ్చి స్థిర నివాసం ఉంటూ ఎస్టీలుగా జీవనం సాగిస్తున్న ఆదివాసులకు , తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం 52 సంవత్సరాల అనంతరం ఈరోజు ఎస్టీ సర్టిఫికెట్ రద్దుచేసి ఆదివాసి బతుకులను అంధకారంలోకి నెట్టివేశారని దుయ్యబట్టారు. దీనివలన చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేక విద్యను మధ్యలోనే ఆపేసి పశువులను కాసుకోవడానికి వెళ్తున్నారని, నిరుద్యోగులు ఉద్యోగాల పై ఆశలు వదులుకున్నారని అన్నారు. ఐదు దశాబ్దాలుగా ఓటర్లుగా గుర్తించి అధివాసీలతో ఓట్లు వేయించుకున్న రాజకీయ పార్టీలు వారి సమస్యలను విస్మరిస్తున్నాయని ఆక్షేపించారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతం నుండి వచ్చిన ఆదివాసీ యువతకు కుల ధ్రువీకరణ పత్రాలను నిలిపివేత దారుణమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై తాము రాజకీయంగా, న్యాయపరంగా భవిష్యత్ పోరాటాలు సాగించి వారికి అండగా నిలుస్తామన్నారు. ఆదివాసీ గ్రామాలను రెవెన్యూ గ్రామలుగా మార్చి తక్షణమే పొడు హక్కులను కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కేసీఆర్ కలరాస్తున్నారు అనడానికి గోండి తెగ కోయిల దుర్భర జీవితాలే దర్పణంగా కనిపిస్తున్నాయి అని సతీష్ అన్నారు. సరిహద్దు ఆదివాసీల సమస్యల సాధనకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తామని ఈ సందర్బంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట క్రాంతి కుమార్, సాదం లోకనాధం, ముత్తరాం రతయ్య, నల్లూరి ఉదయ్, రాచకొండ అనిల్, ఉదయ్ గౌడ్, అధిక సంఖ్యలో ఆదివాసి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.