కరీంనగర్ జిల్లా: మానకొండూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ సీనియర్ నాయకులు పోల్సానీ సుగుణాకర్ రావు, బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పని తిరుపతి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బొంగొని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణ చారి, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మరవెనీ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి సొన్నకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు బొగ్గుల రమేష్ బిజేవైఎం మండల అధ్యక్షులు భాషబోయిన ప్రదిప్ యాదవ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, కార్యవర్గ సభ్యులు నందగిరి బలరాం, కొండ్ర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.