నిజామాబాద్ జిల్లా: బిజెపి తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు “పల్లె పల్లెకు ఓబిసి — ఇంటింటికి బిజెపి” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓబిసి మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసిట్టి రాజ్ కుమార్ అధ్యక్షతన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పెర్కిట్ లోని గృహంలో నిర్వహించినటువంటి సమావేశంలో “పల్లె పల్లెకు ఓబీసీ — ఇంటింటికి బిజెపి” కరపత్రాలను మరియు గోడ ప్రతులను ఆవిష్కరించి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ….
కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓబీసీల అభివృద్ధికై ఎన్నో రకాల పథకాలను అమలు చేయడమే కాకుండా వాటిని కార్యరూపంలో దాల్చడమైందని. 105 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి రాష్ట్రాల ఓబిసి జాబితాలో స్పందించే హక్కు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కల్పించడమైందని. 2017 లో ఓబిసి క్రిమిలేయర్ ఆదాయాన్ని ఆరు లక్షల నుండి 8 లక్షలకు పెంచడం జరిగిందని. మొట్టమొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించడం దానిలో ఐదుగురికి క్యాబినెట్ హోదాతో కూడిన మంత్రి పదవి ఇవ్వడం జరిగిందని. ఓబీసీ విద్యార్థులకు 7565 కోట్ల స్కాలర్ షిప్ లను 44500 ల నుండి 2.5 లక్షల వరకు పెంచడం జరిగిందని. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఓబీసీల అభివృద్ధి కోసం చేపడతా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్లలో ఓబీసీలను అన్ని రంగాలలో అణిచివేయడం తప్ప అభివృద్ధి చేసే ఆలోచనలో లేదని. స్థానిక సంస్థల ఎన్నికలలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను దాదాపు 10% తగ్గించి, 23% కు కుదించడం రాజకీయంగా బీసీలను అనిచివేయడం కాదాఅని. స్థానిక సంస్థల్లో ముస్లింలను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించడం కారణంగా జిహెచ్ఎంసి ఎన్నికలలో దాదాపు 32 మంది ముస్లింలు బిసి సీట్లలో పోటీ చేసి ఎన్నికవ్వడం నిజమైన బీసీలను అనగదొక్కడం కాదా అని, మైనార్టీ గురుకులాలలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను బీసీ గురుకులాల్లో కల్పించకపోవడం, రాష్ట్రంలో మైనార్టీలకు 261 బిసి గురుకులాలు ఉంటే నిజమైన బీసీలకు 192 గురుకులాలను ఏర్పాటు చేయడం నిజమైన బీసీలను అన్నదొకడం కాదా అని, ఒక బీసీ గురుకుల విద్యార్థి మీద తలసరి రూ.లు 75000 ఖర్చు చేస్తాఉంటే అదే మైనార్టీ విద్యార్థికి ₹1,25,000 లు ఖర్చు చేయడం బీసీ విద్యార్థులపై వివక్ష కాదా అని బిజెపి ప్రశ్నిస్తాఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాల వివక్షకు గురవుతున్న ఓబిసి ప్రజలు ఒక్కసారి ఆలోచనచేయాలని. కేసిఆర్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని. ఈ దేశానికి ఒక బీసీ నాయకుడిని ప్రధానిగా చేసింది బిజెపి యేనని. రాష్ట్రంలో బీసీలకు సముచిత నాయకత్వం ఇచ్చింది బిజెపియేనని. అందుకే తెలంగాణ బీసీ ఆశలు, ఆశయాలు, రాజ్యాధికారం, ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న అది డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం అని. అందుకొకసారి రాష్ట్రంలో బిజెపికి అధికారాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరడమైనది. ఈ విషయాలన్నీ కూడా పల్లె పల్లెకు– ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేసి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడమైనది.
ఈ కార్యక్రమంలో చెన్నూరు అసెంబ్లీ ఇంచార్జ్ పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానం