- బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండలం లోని గాలిపెల్లి, రేపాక, సోమారంపేట, వెంకట్రావు పల్లె గ్రామాల్లో బిజెపి మానకొండూర్ అసెంబ్లీ ఇంఛార్జి గడ్డం నాగరాజు, బిజెపి మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ తో పర్యటించి, వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులను కలిసి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాలని కోరుతూ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయంలో వర్షాల వల్ల పంట నష్టం జరిగి, కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం పూర్తిగా కొట్టుకొనిపోవడంతో రైతులు రోదిస్తున్నారని, నష్టపోయిన రైతుల పరామర్శించడానికి లేని సమయం బిఆరెస్ నాయకులకు ప్లీనరీలకు వెళ్లడానికి సమయం ఉందని ఎద్దేవా చేశారు. సరియైన సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచి వర్షానికి తడిసిన ధాన్యాన్ని వేంటనే కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తువల్ల అనేక మంది రైతన్నలు పంట నష్టంతో ఆవేదన చెందుతున్నారని వందల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి, మామిడి కాయలు చాలా వరకు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనావేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం అందించాలన్నారు. రైతులకు ఆవగాహన కల్పించి ప్రతీ పంటకు వారు భీమా చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి,తిప్పారాపు శ్రవణ్,ఇట్టి రెడ్డి లక్ష్మా రెడ్డి,రొండ్ల మధుసూదన్ రెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,కాత మల్లేశం, మ్యాకల మల్లేశం, కొలనూర్ ముత్తక్క,లొంకోజ్ చంద్రం, అమ్ముల అశోక్,సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,పోతారాజు పర్శరాములు, రంగు రమేష్, చెప్యాల గంగాధర్, సూదుల కిషన్,మామిడి హరీష్,మామిడి శేఖర్,పత్యం రాజి రెడ్డి,పున్ని రాజు,ఎలుక వర్ధన్,అక్కేం మధు, సుదగోని నారాయణ, పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, చిమ్మణ గొట్టు శ్రీనివాస్,బొల్లం సాగర్, అంతగిరి అనిల్, ఖాడోజీ గారి మోహన్ రెడ్డి,సింగిరెడ్డి రమణ రెడ్డి, మిట్టపెల్లి దేవేందర్ రెడ్డి,పున్ని అనిల్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.