కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన తొమ్మిది ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్ లో బాగంగా గురువారం మానకొండూరు మండల కేంద్రంలో ఇంటింటికీ (గడప గడపకి) బీజేపీ కార్యక్రమంలో బూత్ నెంబర్ 3,4 లో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు హాజరై నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరంలో చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలు, బుక్స్ ప్రజలకు అందజేయడం జరిగింది. అనంతరం నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలనకు మద్దతుగా 9090902024 నెంబర్ కు ప్రజలు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు బాష బోయిన ప్రదీప్ యాదవ్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, ఎడెల్లి సంపత్ మరియు కార్యకర్తలు