- రసమయి చిత్రపటం ధరించి రోడ్డుపై గుంతలో నిలబడిన వ్యక్తికి వినతిపత్రం
రాజన్న సిరిసిల్ల జిల్లా : ది రిపోర్టర్ టీవీ: ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో అకాల వర్షానికి రోడ్ల పై ఏర్పడిన గుంతలను వెంటనే మరమత్తులు చేపట్టాలని రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటం ధరించిన వ్యక్తిని అదే గుంతల్లో నిలబెట్టి వినతి పత్రం అందజేశారు. నిరసన చేస్తున్న ప్రదేశానికి పోలీసులు చేరుకొని రసమయి బాలకిషన్ చిత్రపటాన్ని లాక్కొని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్డు మోకాలి లోతు గుంతల నుండి ప్రతిరోజూ వందలాది మంది వాహనదారులు వెళుతుంటారని, రోడ్డుపై గుంతలు తప్పించబోయి చాలామంది ప్రమాదం బారినపడుతున్నారని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్లు బాగు లేక మండల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలకులకు పట్టడం లేదా అని ప్రశ్నించారు. రోడ్డు సమస్యకు పరిష్కారం చేయకపోవడం వల్ల అధికార దుర్వినియోగం కి పాల్పడుతున్న రసమయి బాలకిషన్ అభివృద్ధి ప్రదాతలు అయ్యారా అని ప్రశ్నించారు. ఏ ప్రజా సమస్యలపై శాంతి యుతంగా పోరాటం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీస్ అధికారులతో అణిచిత ధోరణి అవలంబించడం పరిపాటిగా మారిందని రానున్న కాలంలో బిఅరెస్ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పనున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. లేనియెడల త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంతో రోడ్డు మరమ్మత్తు చేసే అంతవరకు పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకన్వీనర్ బత్తిని స్వామి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు భూమల్ల అనిల్, మండల అధికార ప్రతినిధి భూమల్ల ప్రశాంత్,మండల బీజేవైఎం అధ్యక్షుడు పున్ని సంపత్, మహిళా మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కొలనూరు ముత్తక్క, శక్తి కేంద్రం ఇంచార్జ్ దేశెట్టి శ్రీనివాస్, పొన్నం కృష్ణ, బూత్ అధ్యక్షులు చింతలపల్లి రాజారెడ్డి,రంగు రమేష్, చిమ్మన గోట్టు శ్రీనివాస్, నాయకులు వజ్జపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.