- శ్రమను గుర్తించిన అధిష్టానం
- ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం ఇచ్చిన ప్రధాని.
- రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే.
సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ: బిజెపి జాతీయ అధిష్టానం తెలంగాణ బిజెపి పార్టీ మాజీ అధ్యక్షుడు మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ సేవలను గుర్తించి, కెసిఆర్ ప్రభుత్వం సంజయ్ పై చేస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు,ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ మండలం లోని బేగంపేట గ్రామంలో బిజెపి శ్రేణులతో బాణసంచా పేల్చి సీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దుకాణం బంద్ అవుతుందని గ్రహించిన కెసిఆర్ తన అనుచరులతో బిజెపి రాష్ట్రంలో పుంజుకుంటుందని భయంతో బండి సంజయ్ పై అవసరంలేని ఆరోపణలు చేస్తున్నారని, బండి పని అయిపోయిందని భ్రమ పడుతున్నారని పేర్కొంటూ, రానున్న ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల్ కిషన్ మోర్చా అధ్యక్షుడు చింతలపల్లి రమాపతి రెడ్డి, గంప లవన్, గొడుగు సంపత్, జంగిటి వెంకటరెడ్డి , బుర్ర క్రాంతి కుమార్ ,బుర్ర నాగరాజ్, కొరివి అమరేందర్, బుర్ర సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.