పల్నాడు జిల్లా : మాచెర్ల మండలం చింతల తండా గ్రామానికి చెందిన రమావత్ సైదా నాయక్ పిడుగు పాటు గురై మరణించిన కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు యాదవ్ పరామర్శించారు. జరిగిన సంఘటన బాధాకరమైందని అన్నారు. మాచెర్ల ప్రభుత్వ హాస్పిటల్ లో సైదా నాయక్ భౌతిక కాయాన్ని సందర్శించి వారి తండ్రిని పరామర్శించి ఘటన జరిగిన వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. బాధిత కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రెంటచింతల గ్రామానికి చెందిన వీరబోయిన లింగయ్యకు చెందిన 26 పొట్టేలు కూడా పిడుగుపాటుకు మృతి చెందడం జరిగింది. అతనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేసారు.
