హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులపై విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు.బాధ్యత గల మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఐటీ సోదాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండవని ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్లను చెత్తడబ్బాలో దాచుకోవాల్సిన అవసరం ఏముందని రఘునందన్ రావు ప్రశ్నించారు.వచ్చిన కంప్లైంట్ ప్రకారమే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని రఘునందన్ రావు తెలిపారు.ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకున్న ఆయన తన కుమారుడిని కొట్టారని మల్లారెడ్డి అనడం సరికాదన్నారు.