మంచిరియల్ జిల్లా : నస్పూర్ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో నెలకోన్న త్రాగు నీరు, డ్రైనేజ్, రోడ్లు మరియు విద్యుత్ తీగల సమస్యలు మరియు మున్సిపాలిటీ శాశ్వత డంపింగ్ యార్డ్, ఓపెన్ జిమ్ లు, క్రీడ మైదానాలు మరియు ప్రధాన కూడల్ల వద్ద మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రఘునాథ్ వెరబెల్లి మరియు అగల్డూటీ రాజు ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపల్ కార్యాలయం ముందు పేద ఎత్తున ప్రజలతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే దివాకర్ రావు అండతో టిఆర్ఎస్ కౌన్సిలర్లు అవినీతికి పాల్పడుతున్నారని, మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం మరిచి మున్సిపాలిటీనీ అవినీతికి అడ్డాగా మార్చారని రఘునాథ్ అన్నారు.