కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ మీడియా వాలంటీర్ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోమ్, సహకార మంత్రి శ్రీ అమిత్ షా పాల్గొని సోషల్ మీడియా కన్వీనర్లకు మార్గ నిర్దేశం చేశారు, తెలంగాణలో 17 సీట్లకు 17 గెలిచే విధంగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. మరియు దేశంలో 400 కు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని నరేంద్ర మోడీ హయాంలో మూడవ సారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పరపెల్లి శ్రీనివాస్, జిల్లా మీడియా ఇంచార్జి కటకం లోకేష్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గొడుగు వినోద్ కుమార్, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మచ్చ మురళీకృష్ణ, ఆకుల మనోహర్, కరీంనగర్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ కొలిపాక అరవింద్, అవునూరి భారత్, కొత్తకొండ వెంకటసాయి, సాయినాథ్, నాగరాజు, నాగసముద్రాల సంతోష్, అనిల్, బొమ్మ మహేష్, బలగోని శ్రీనివాస్, పల్లె శివారెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
