ఆంధ్రప్రదేశ్ : మంగళగిరి NRI కాలేజీని పక్కన ఉన్న 80 కోట్ల రూపాయల విలువగల దళితుని భూమిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్రమించి దౌర్జన్యాలకు పాలుపడుతున్నట్టు సమతా సైనిక్ దళ్ ఆందోళనకు దిగింది. అక్రమాల మీద ఫిర్యాదు చేయడానికి,, విజయవాడ పుస్తక మహోత్సవానికి హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినప్పటికి కలవనివ్వకుండా సోము వీర్రాజు, బిజెపి మీడియా కన్వినర్ లక్మిపతిరాజు అడ్డుపడ్డారని ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 18న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ముట్టడిస్తామని సమతా సైనిక్ దళ్ ప్రకటించింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.