కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షతులై బీజేపీ నుండి బీఆరెస్ పార్టీ లోకి చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హుజురాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.ఆదివారం వీణవంక మండలం లోని చల్లూరు గ్రామానికి చెందిన పలువురు బిజెపి నాయకులు బీఆరెస్ లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తనని ఎమ్మెల్యే గా గెలిపిస్తే చల్లుర్ ను మండలం గా చేసి గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
