తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఓ కీలక నియామకాన్ని ప్రకటించింది. బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బన్సల్‌కు తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. అంతేకాకుండా ఆయనకు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్యతలతో పాటుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా శాఖల ఇంచార్జీగానూ నియమించారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री सुनील बंसल, प्रदेश महामंत्री (संगठन) उत्तर प्रदेश को पार्टी का राष्ट्रीय महामंत्री नियुक्त किया है।
श्री सुनील बंसल को पश्चिम बंगाल, ओडिशा एवं तेलंगाना की प्रदेश प्रभारी के रूप में जिम्मेदारी रहेगी। pic.twitter.com/1b4eYlq1ei
— BJP (@BJP4India) August 10, 2022