- భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా బొబ్బిలి నియోజకవర్గం
- భూ కబ్జా దారులపై చర్యలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్
విజయనగరం, బొబ్బిలి,ది రిపోర్టర్ న్యూస్ : బొబ్బిలి పట్టణంలో నాయుడు కాలనీ పక్కనే ఉన్న కోటి చెరువు కబ్జా కోరల్లో చిక్కుకొని పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని. ఈ కోటి చెరువును పరిరక్షించవలసిన రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు అధికార పార్టీ నాయకులకు ఊగిడం చేస్తూ ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్న ఏమీ తెలియనట్లు వ్యవ హరించడం సిగ్గుచేటు అన్నారు. బొబ్బిలి పట్టణంలో ఎంతో పేరున్ననాయుడు కాలనీను ఆనుకుని ఉన్న కోటి చెరువును కొంతమంది భూకబ్జాదారులు రాత్రికి రాత్రి మట్టి గ్రావెల్ను తెచ్చి జెసిబి తో దర్జాగా చదలు చేసుకుంటున్న అధికారులు నిద్రపోవడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కబ్జాకు గురైన కోటి చెరువును శుక్రవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న. మాట్లాడుతూ…. ఇప్పటికే బొబ్బిలి పట్టణంలో భూకబ్జాదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎదురు లేకుండా పోయిందని. ప్రభుత్వ స్థలం కానీ ప్రభుత్వ చెరువులు,స్థలాలు ఎక్కడ కనిపెట్టిన రాత్రికి రాత్రి కబ్జాలు చేసి లే అవుట్లు వేయడం అందరికి తెలిసిన విషయమే అన్నారు.
నేను అధికారంలోకి వస్తే బొబ్బిలి పట్టణంలో జరుగుతున్న భూ కబ్జాలపై ఉక్కు పాదం మోపుతానని ప్రకటించిన ఎమ్మెల్యే సంబoగి వెంకట చిన్నప్పల నాయుడు పట్టణంలో ఇంత స్థాయిలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే కనీసం పట్టించు కోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి కోటి చెరువు హద్దులను సర్వే చేసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మున కాల శ్రీనివాస్. సిపిఐ పట్టణ నాయకులు వై బాబ్జి పాల్గొన్నారు.