సిద్దిపేటజిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో బొడ్డు రాయి ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ, మనకొండూర్ మాజీ ఎమ్మెల్యే అరేపెల్లి మోహన్ ,బెజ్జంకి పీఏసీస్ సి చైర్మన్ తన్నీరు శరత్ రావు పాల్గొన్నారు. వీరిని గ్రామ సర్పంచ్ రాజశ్రీ శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు, వారితోపాటు పులి కృష్ణ,శీలం నర్సయ్య, గ్రామస్థులు గుడెల్లి శ్రీకాంత్,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
