కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ నాయకులు బొడ్డు సునీల్ ఒక ప్రకటనలో తెలిపారు. మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చి తొమ్మిది సంవత్సరాలైనా కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబల్ రోడ్డు మొదటిసారి గెలిచినప్పుడు మాట ఇచ్చి, రెండో టర్మ్ అయిపోయేందుకు వస్తున్న కూడా ఇంకా పనులు స్టార్ట్ కాలేదు,గన్నేరువరం మండల కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మొదట గెలిచినప్పుడు 60 ఇండ్లు కట్టిస్తానని మాట ఇచ్చి . 30 ఇండ్లకు పిల్లర్లు వేసి వదిలిపెట్టారు, మండలంలో ఏ ఊరిలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదు,
అరుంధతి కళ్యాణ మండపం 50 లక్షల రూపాయలతో గన్నేరువరం మండల కేంద్రంలో కట్టిస్తానని మాట ఇచ్చి ఇంతవరకు అది స్టార్ట్ చేయలేదు.వర్షాకాలం వస్తే కనీసం మండల కేంద్రంలోకి ఏ ఒక్క ఆఫీసర్ , ఆఫీస్ స్టాఫ్ కూడా ఆఫీస్ కి వచ్చే వీలు లేకుండా మండలం చుట్టూ చెరువులు నిండి పొంగిపొర్లుతుంటే కూడా కనీసం కల్వర్టులు అయినా కట్టిద్దామని ప్రయత్నం కూడా చేయలేదు.వర్షాలు పడితే అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు గర్భిణీ స్త్రీలకు కనీసం అంబులెన్స్ లో వెళ్దామన్నా వెళ్లలేని పరిస్థితి. గన్నేరువరం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు మూడు అవసరం ఉన్నాయి. ఎన్నోసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన కూడా పట్టించుకోలేని పరిస్థితి, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత స్థలం ఉన్నా కూడా వాటికి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి సొంత భవనాలకు నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. దాదాపు 350 జనాభా ఉన్నా స్కూల్లో పర్మనెంట్ అటెండర్ ను కూడా పెట్టియని పరిస్థితి, కొన్ని సంవత్సరంల నుండి ప్రజలకు కొత్త పెన్షన్ల జాడే లేదు,అని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బొడ్డు సునీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.