సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ: బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రజా బంధు డాక్టర్ రసమయి బాలకిషన్ స్థానికుడు కాదు అని పేర్కొనడం వారి అజ్ఞానానికి నిదర్శనం, మానకొండూరు అభివృద్ధిని చూసి రోజు రోజుకి రసమయి బాలకిషన్ కు పెరుగుతున్న ప్రజా ఆదరణ చూసి కాంగ్రెస్ నాయకులకు మతిభ్రమిస్తున్నట్లుందని విమర్శించారు. భారత రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, భారతదేశంలో ఎలాంటి పాస్పోర్ట్ వీసా లేకుండా ఎక్కడైనా నివసించొచ్చు , ఎన్నికలలో ఎక్కడి నుండైనా పోటీ చేయొచ్చు అని కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కడి వారు ఇక్కడి నుండి పోటీ చేశారో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎవరెన్ని విమర్శలు చేసిన, అడ్డంకులు సృష్టించిన రాష్ట్రంలో వచ్చేది బిఆర్ఎస్ పార్టీ అని, మానకొండూర్ గడ్డ రసమయి అన్న అడ్డా అని గుర్తుపెట్టుకోవాలని రానున్న ఎన్నికలలో మానకొండూరు నుండి రసమయి బాలకిషన్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం మండల అధ్యక్షుడు బిగుళ్ల మోహన్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కల్లూరి రమేష్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతోష్ గౌడ్,సీనియర్ నాయకులు అన్నాజీ బాలా చారి, విద్యార్థి విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షులు బిగుల్లా దుర్గ సుదర్శన్, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర ప్రభాకర్ గౌడ్, మాంకాల బాబు, బోనగిరి నవీన్, మామిడ్ల తిరుపతి, పైడి గణేష్, లింగాల శ్రీనివాస్, బోనగిరి మధు, మాంకాల పోచ మల్లు, తదితరులు పాల్గొన్నారు.