కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ ప్రజలు ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. వాడ వాడలా మహిళలు ఇంటికో బోనమెత్తుకొని డప్పు చప్పుళ్ళతో, శివ సత్తుల పూనకాలు ఆటా,పాటలతో పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. బోనం లోని నైవేద్యం, పసుపు,కుంకుమ, ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా, జెల్లా, గోడ్డూ, గోద సళ్ళంగా చూడు తల్లీ అని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న, ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్రారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, గ్రామ పెద్దలు,యువకులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.