అల్లూరి జిల్లా- గూడెం కొత్తవిధి – ది రిపోర్టర్ :సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం రింతాడ గ్రామపంచాయతీ దుచ్చరిపాలెం బిర్జు వద్ద ఆటో బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిముల బంద గ్రామం నుండి లంకపాకలు ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది, ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటోని నడపడంవల్లనే ప్రమాదం జరిగిందని పలువురు తెలిపారు బ్రిడ్జి వద్ద ప్రమాదకర టర్నింగ్ ఉండడం వేగంగా ఆటో రావడం వలన ఈ ప్రమాదం సంభవించింది,గాయపడిన వారిని చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.
