కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన సీపతి పరుశరాములు (50) సం,, ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంట్లో అటాచ్ బాత్రూం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారము ఇటీవల నూతన గృహప్రవేశం చేసుకున్నారు.. గతంలో గల్ఫ్ దేశం వెళ్లి వచ్చాడు, మతిస్థిమితం కోల్పోయి ప్రస్తుతం గ్రామంలోని ఉంటున్నాడు, భార్యతో పాటు కుమారుడు బంధువుల ఇంటికి వెళ్ళగా ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, ఎస్సై మామిడాల సురేందర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతుని పరిశీలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు,