అల్లూరి జిల్లా, హుకుంపేట :మండల కేంద్రంలో గిరిజనేతరులు విచ్చలవిడిగా అక్రమ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. 1/70 భూ బదలాయింపు నిషేదపు చట్టం తలుపులు బార్ల తెరిచి అక్రమ నిర్మాణాదారులకు, స్థానిక రెవెన్యూ అధికారులు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలు తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు రామారావు, క్రిష్ణ రావు మరియు డి ఎల్ ఓ రాష్ట్ర అధ్యక్షులు (తడిగేరి సర్పంచ్) పెనుమాలి రంజిత్ కుమార్ లు సంయుక్తంగా పత్రిక ప్రకటన ద్వారా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మండల కేంద్రంలో గిరిజనేతరులు విపరీతంగా అక్రమ శాశ్వత నిర్మాణాలు చేపడుతునే ఉన్నారన్నారు. వీటిపై అనేక మార్లు అధికారులకు పిర్యాదు చేయడం జరిగిందనీ వారు తెలియజేశారు.గత రెండున్నర ఎండ్లలోనే గిరిజనేతరులూ 22 అక్రమ శాశ్వత భవంతుల నిర్మాణాలు చేపట్టినట్టు వారు తెలిపారు. వీటిపై గతంలో గిరిజన అఖిల పక్షల అద్వారంలో పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించడంతో,అక్రమ నిర్మానదారులూ, అధికార్లు లోపాయికార ఒప్పందంతో నిర్మాణాలు పూర్తి చేసుకొన్నారని వారు ఆరోపించారు. 1/70 చాట్టం ప్రకారం (గిరిజనేతర) అధికారులు సైతం గిరిజనేతరులు గానే పరిగణింప బడుతుందని పేర్కొంది. కాబట్టిగా ఇకపై పిర్యాదులు చేసేదే లేదని,కలిసొచ్చే ఆదివాసీ సంఘాలతో ప్రత్యేక్ష ఉద్యమాలకు సొద్దమౌతామని వారు తెలిపారు.
గిరిజనేతరుడు దొడ్డి ప్రసాద్ అక్రమానిర్మాణాలు (12) డజన్
గిరిజనేతరుడు టైలర్ దొడ్డి ప్రసాద్ ఇప్పటికే 12(డజన్) అక్రమ నిర్మాణాలు చేపట్టారని మరలా రెండు షాపులు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని వారు తెలియజేశారు. బడ్డేకు కొండమ్మ రెవెన్యు కార్యాలయ సమీపంలోనే అక్రమ నిర్మాణం చేపడుతుంటే అధికారులు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు.స్థానిక రాళ్లగడ్డవద్ద గిరిజనేతరుడు ఈశ్వరరావు నిర్మిస్తున్న నిర్మాణం పై అధికారి తీసుకొన్న చర్యలేమిటి భాహిర్గతం చేయాలనీ వారు డిమాండ్ చేశారు. గిరిజనులు, గిరిజన ప్రజా సంఘాల ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గిరిజనేతరులు ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణలను అడ్డుకట్ట వేయడానికి కలిసి రావాలని అన్నారు. అధికారులు చెతులు ఎత్తేసారు, మన హక్కులు, చట్టాలు మనమే కాపాడు కావాలని వారు పిలుపు నిచ్చారు.