- రెండు గంటల సేపు ఆగిపోయిన 108 అంబులెన్సు
- ఫోన్ చేస్తే పట్టించుకోని 108 అధికారులు
- 108 వాహనంలో అవస్థలు పడ్డ పేషేంట్
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ : మాచర్ల నుండి 108 అంబులెన్సు లో నర్సారావు పేట కి పేషేంట్ ని మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణ పల్లి దగ్గర 108 వాహనం టైర్ పంచర్ అయి ఆగిపోయింది. వెంటనే వేరే అంబులెన్సు కోసం ఫోన్ చేస్తే ఏ ఒక్కరు పట్టించుకోలేదు. 108, 104 కి ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి లాభం లేకపోయింది. రెండు గంటల సేపు పేషేంట్ 108 వాహనంలోనే ఇబ్బందులు పడవలసి వచ్చింది. మనుషుల ప్రాణాలకు విలువలేకుండా పోయింది. అధికారులు పట్టించుకోరు, వ్యవస్థ దారుణంగా తయారైందని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేసారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరారు.