వినుకొండ:- శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో పలు దుకాణాల్లో కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్లు అమ్మకాలు నిర్వహిస్తున్నారని, అవి తిని పిల్లలు అస్వస్థతకు గురౌతున్నారని ఆయినా ఆహార భద్రత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తినుబండారాలు అమ్మకాలు నిర్వహించేవారి దుకాణాల్లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించక పోవడంతో దుకాణ దారులు కొందరు కాలం చెల్లిన తినుబండారాలు కూడా అమ్మకాలు నిర్వహిస్తున్నారని ఇకనైనా అధికారులు స్పందించి కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్లు అమ్మకాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే పిల్లలు అనారోగ్యానికి గురై వారికి ఏమైనా అయితే దానికి అధికారులు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.