- మునగ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: నాబార్డ్ సౌజన్యంతో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మునగ సాగు,సాంకేతిక వ్యాప్తి ధార విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారుచేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఉద్దేశంతోనే నాబార్డ్ పైలెట్ ప్రాజెక్టు కింద గన్నేరువరం మండలంలోని మైలారం గోపాల్పూర్, ఖాసీంపేట,సుందరగిరి గ్రామాలలో ఈ ప్రాజెక్టును 50మంది రైతులతో అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 30మంది రైతులు మునగ మొక్కలు పెట్టడం జరిగిందని,వాటి ద్వారా మునగకాయలతో పాటు ఆకులు కూడా డ్రై చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా రైతులకు మంచి ఆదాయం సమకూరుతుందని నాబార్డు డీజీఎం శ్రీరాం తెలిపారు. అలాగే మునగలు అంతర పంటగా బంతి, టమాట ద్వారా రజిని రెడ్డి అనే రైతు 35వేల వరకు ఆదాయాన్ని పొందడం జరిగిందని,ఇది అదనపు ఆదాయంగా వారికి రావడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ తోపాటు సోలార్ డ్రైవర్ ప్యాకింగ్ మిషన్ వీటి ద్వారా ఫస్ట్ లైసెన్స్ తో పాటు మునగ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి కాల్షియం మెగ్నీషియం పొటాషియం లాంటి పోషక విలువలు ఉన్న మునగను పౌడ రూపంలో,టాబ్లెట్ల రూపంలో తీసుకురావడానికి ఫైవ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజ్ ఎస్ ద్వారా 35 శాతం సబ్సిడీ ద్వారా కూడా మైలారంలో రానున్న రోజుల్లో ఫ్యాక్టరీని రన్ చేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన టెక్నికల్ గైడెన్స్ ను జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే రైతులతో మునగ సాగు విధానాలను అడిగి వారి ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని డీజీఎం తెలిపారు.ఈ కార్యక్రమంలో నాబార్డ్ కరీంనగర్ క్లస్టర్ ఆఫీస్ ఏజీఎంలు జయప్రకాష్,పి మనోహర్ రెడ్డి వీరితోపాటు జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి పెండ్లి సంపత్ కుమార్, కన్స్లెంట్ ఆంజనేయులు,జన వికాస ప్రతినిధి రాజు,ఆదర్శ రైతు దంపతులు ముత్యాల రమణారెడ్డి రజిని,అలాగే రైతులు బద్దం రజిని, మిరుదొడ్డి రాజు,ఆకుల సంతోష్, కుమార్,ఎన్ ఎం సదానందం, దాడి సరూప, తిరుపతి,మొదలగువారు పాల్గొన్నారు.