- నకిలీ పాసు పుస్తకాలతో శావల్యాపురం చైతన్య గోదావరి బ్యాంకు కు టోకరా వేసిన కేటుగాళ్లు,
- నకిలీ పాసు పుస్తకాలు, స్టాంపులు తయారు, ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ లో రెవెన్యూ అధికారుల పాత్ర…???,
- ఏనిమిది మంది లో ఆరుగురు అరెస్టు…మరో ఇద్దరిని అరెస్టు చేయవలసి ఉంది…నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసిన రెవెన్యూ సిబ్బంది ని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపిన పోలీసులు.
వినుకొండ:- శావల్యాపురం మండలం కేంద్రంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు లో పాసుపుస్తకాలపై రుణాలు పొంది ఎన్నాళ్లకు నగదు చెల్లింపులు చేయకపోవడంతో పాసుపుస్తకాలు తీసుకుని ఆ యా గ్రామాల్లో బ్యాంకు అధికారులు విచారించగా,తమది కాని భూమి కి నకిలీ పాసు పుస్తకాలు తయారు చేయించుకుని ఆ పుస్తకాలు బ్యాంకు లో తనఖా పెట్టి సుమారు 76 లక్షల రూపాయల రుణాలు పొందిన కేటుగాళ్ల సంగతి బయటపడింది.ఈ సంఘటన పై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలిసులు విచారణ చేపట్టగా శావల్యాపురం మండలం పిచికలపాలేం గ్రామానికి చెందిన తిరువీధి అశోక్, తిరువీధి రవి, తిరువీధి యోగయ్య, చిమటా వెంకటేశ్వరరావు, బొడేపూడి వెంకయ్య, దోగిపర్తి చిన్న అంజి (వినుకొండ మండలం నరగాయపాలెం), మరో ఇద్దరు ( పేర్లు వెల్లడించలేదు అధికారులు ) కలిసి ఆ సమయంలో పని చేస్తున్న రెవెన్యూ అధికారుల సహాయంతో పాసుపుస్తకాలు, స్టాంపు లు తయారు చేయించి పాసు పుస్తకాల పై ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేయించి,ఆ పాసు పుస్తకాలు బ్యాంకు లో తనఖా పెట్టి రుణాలు పొందినట్లు సమాచారం.
ఈ సంఘటనలో ఎనిమిది మందికి గాను ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు,మరో ఇద్దరిని,నకిలీ పాసు పుస్తకాలు,స్టాంపు లు తయారు చేసిన రెవెన్యూ సిబ్బంది ని అరెస్టు చేయవలసి ఉందని తెలిపిన రూరల్ సీఐ రమేష్ బాబు,యస్ఐ రవికృష్ణ.