మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తిలో అత్తింటి వరకట్న వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే సెంటినరీ కాలనీకి చెందిన తోట లలిత మల్లయ్య దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తె ప్రవళిక(25)ను బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తికి చెందిన అపరాధ వనమ్మ సారయ్య దంపతుల కుమారుడైన సతీష్ కు గత సంవత్సరం 2022 మే నెలలో 35 లక్షల రూపాయల కట్నకానుకలు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. సతీష్ వృత్తిరీత్యా సింగరేణి సంస్థలో పని చేస్తున్నాడని, అదనపు కట్నం కోసం తరచూ కుటుంబసభ్యులతో కలిసి వేధించేవాడని, అది భరించలేని ప్రవళిక మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రవళిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, త్వరలోనే పరారీలో ఉన్న సతీష్ కుటుంబ సభ్యులను పట్టుకుంటామని ఏసిపి సదయ్య తెలిపారు.
బైట్: సదయ్య (ఏసిపి)