కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలో పిడుగుపాటుకు రెండు పశువులు మృతి చెందాయి. మండలంలో శుక్రవారం అకాల వర్షంతో పాటు పిడుగు వేయడంతో బొజ్జ కొమురయ్య అనే రైతుకు చెందిన పశువులు పొలం వద్ద ఉండగా, పిడుగు వేయడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పశువుల మృతితో రూ. లక్ష యాభై వేల వరకు నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
