హన్మకొండ : వీధి కుక్కలు రోజూ ఎక్కడో అక్కడ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో.. ఏమో కుక్కలు వీధుల్లో చెలరేగిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే దాడి చేసి పిక్కలు పీకుతున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా ఖాజీపేటలో శుక్రవారం రోజు వీధి కుక్కలు మరో బాలుడి ఉసురు తీశాయి. 8 ఏళ్ల బాలుడు చోటుపై కుక్కలు పిచ్చెక్కి స్వైరవిహారం చేశాయి. స్థానిక రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్ పార్కు దగ్గర తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కుక్కలు దాడికి తెగబడ్డాయి.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చోటు ప్రాణాలు విడిచాడు. దీంతో బాలుడి పేరెంట్స్, బంధువులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. చోటు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మృతుడి కుటుంబాన్ని ఓదార్చేందుకు ఆస్పత్రికి వెళ్లారు.