అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులు పైన, మహిళల తేడా లేకుండా భౌతికంగా దాడి చేస్తూ గాయపరచి ఆసుపత్రుల పాలు చేస్తున్నా యి పట్టణంలో రోజు ఏదో ఒకచోట కుక్కల బారిన పడే ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా 16వ వార్డులో కమేళా వీధి లో పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులను ఒక పాదాచారాన్ని కరచి గాయపరిచాయి కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపి కుక్కల బెడద నుండి విముక్తులను చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.
