- అద్దె ఇంట్లో ఏడేళ్లుగా నిర్వహణ
అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి (ది రిపోర్టర్ ): నూతన అంగన్వాడి కేంద్రాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని చింతలపూడి గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని చింతలపూడి పంచాయతీ కేంద్రంలో అంగన్వాడి సెంటర్ పూర్తి కాక పోవడంతో గత ఐదేళ్లుగా అద్దె ఇంట్లో నిర్వహించడం జరుగుతుంది. 2016-2018 సంవత్సరంలో నిర్మాణం చేపట్టారు, కానీ నేటికీ అంగన్వాడీ భవనంను గుత్తే దారుడు పూర్తి చేయకుండా చేతులు ఎత్తేశాడు,ప్రస్తుతం 65 మంది పిల్లలు అంగన్వాడి సెంటర్లో ఆట,పాటలు నేర్చుకుంటున్నారు. పంచాయతీ కేంద్రంలో అంగన్వాడీ సెంటర్ లేకపోవడం చాలా బాధాకరం,పిల్లలు ఆటలు, పాటలు, భోజనాలు చేసేందుకు కూడా అద్దె ఇల్లు సరిపడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా అంగన్వాడీ భవనం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.సంబందింత అధికారులు సమస్యను వెంటనే గుర్తించి నూతనంగా అంగన్వాడి సెంటర్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో కి తీసుకుని రావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.