పిడుగురాళ్లలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తరలింపు.. పగలు, రాత్రులు తేడా లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు.. చెరువులను తలపించేలా తవ్విపోతున్న మాఫియా.. ఇళ్ల స్థలాలు, వెంచర్లకు తరలిపోతున్న మట్టి.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న రెవిన్యూ, మైనింగ్ అధికారులు.. దొరికింది దోచుకోవడమే వాళ్ళకు తెలిసింది.. అది ఇసుకైనా, మట్టయినా బొక్కడమే వారి పని.. అధికార రాజకీయ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది.. అడిగే వారు లేరు.. అడ్డుకునే దమ్ము ఎవరికి లేదు అన్నట్లుగా పైసా పెట్టబడి లేకుండా ఎర్రబంగారాన్ని అక్రమంగా తరలించుకు పోతున్నారు..అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది.. ఇదే అదునుగా మట్టి మాఫియా రాత్రి, పగలు తేడా లేకుండా కొల్లగొట్టేస్తుంది. ఇసుకకు ఎంత డిమాండ్ వుందో అంతే స్థాయిలో మట్టికి పిడుగురాళ్ల లో విపరీతంగా డిమాండ్ రావడంతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ భూములు కనబడితే చాలు మట్టిని తోడేస్తున్నారు అక్రమార్కులు. కొన్ని ప్రాంతాల్లో పట్టాలున్న బీడు, రిజిస్ట్రేషన్ భూముల్లో సైతం పదో, పరకో ఆశ చూపి భవిష్యత్తులో ఆ భూమిని పనికిరాకుంకా తవ్వేస్తున్నారు. పిడుగురాళ్ల పట్టనంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ తవ్వకాలు ఎక్కువగా జరుగుతుతున్నట్లు గతంలో ది రిపోర్టర్ టివి కథనాలు వేసినప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చెర్యలు తీసుకోవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.