పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ సిఐ షమీముల్లా పై ఓ తల్లి జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి కి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే ఓ దొంగతనం కేసులో సూదిబోయిన ఏసుబాబు అనే యువకుడిని మాచర్ల పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ దొంగతనం నిర్ధారణ అయిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. తల్లి పద్మ తన బిడ్డ ఏసుబాబును గత పదిరోజులుగా పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తుంది. అంతేకాక 20 వేల రూపాయలు లంచం ఇస్తే వదిలేస్తాననని లేకుంటే గంజాయి కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నట్టు బాధితుడి తల్లి పద్మ ఆరోపిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం పై జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.