- నా బిడ్డను ఎక్కడ చంపారు చెప్పండి ?
- జెసిపి గుంతలో శవం లభ్యం
- పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన మహిళలు
సంగారెడ్డి :మా బిడ్డను తీసుకెళ్లారు…. ఎక్కడ చంపేశారు చెప్పండి…. మిమ్మల్ని చెప్పేవరకు వదలం.. అంటూ మహిళలు పుల్కల్ పోలీస్ స్టేషన్ ను శనివారం సాయంత్రం బుట్టడించారు. పోలీసులు తమ ఫిర్యాదు చేసన సరైన సమయంలో స్పందించలేదని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దిరెడ్డి పేట గ్రామానికి చెందిన లక్ష్మి సాయిలు దంపతులకు ఉన్న ఒక కొడుకు జశ్వంత్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అదే గ్రామానికి చెందిన మహేష్, ప్రసాద్ లతో కలిసి గ్రామ సమీపంలోని జెసిపి తీసిన గుంతలో ఈతకు వెళ్లారు. కాగా ఇంట్లో నుంచి వెళ్లిన జశ్వంత్ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వెతికారు. అటుగా వెళ్లిన ప్రసాద్ మహేష్ తో పాటు జస్వంత్ లను చూసిన స్థానికులు జెసిబి తీసిన గుంతల వైపు వెళ్ళాడని తెలుపగా గ్రామానికి చెందిన కొందరు యువకులు అటు వెళ్లి చూశారు. గుంత సమీపంలో చెప్పులు మాత్రమే కనిపించడంతో తన కొడుకును కావాలనే మహేష్ ప్రసాద్‌లు అందులో తోసి వేసి చంపేశారని ఆరోపించారు. ఈ విషయం పై మహేష్ ప్రసాద్ లో పై అనుమానం ఉందని శనివారం ఉదయం ఫిర్యాదు చేసిన సాయంత్రం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. దీంతో ఎస్సై విజయ్ కుమార్ అనుమానాలతో ఉన్న మహేష్ ప్రసాద్ లను సంఘటన స్థలం తీసుకెళ్లి ఎక్కడ ఈత కొట్టారో పరిశీలించారు. ఇది ఇలా ఉంటే శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జస్వంత్ మృతదేహం తేలింది. మృతిని ఒంటిపై గాయాలు ఉన్నాయని వృత్తిని తల్లి లక్ష్మి ఆరోపించింది. ఈ మేరకు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.