మెదక్ జిల్లా మాసాయిపేట మండలం సంగ్య తండా గ్రామ పంచాయతీ నుండి వడియారం జాతీయ రహదారి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి నూతనంగా నిర్మించడం జరిగింది. దానికి ఆనుకొని ఒక గోడ ని నిర్మించారు. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 900 మీటర్ల పొడవు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సర్పంచ్ ఫకీర్, ఎంపీటీసీ సోనీ శ్రీనివాస్ సంఘంటన స్థలాన్ని సందర్శించారు. తదుపరి వారు మాట్లాడుతూ కాంట్రాక్టు, రైల్వే అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని. నాణ్యత లోపం వలననే గోడ కూలిందని ఆరోపించారు. ఐరన్ వాడకుండా గోడ కట్టారని అందుకనే గోడ కూలిందని, నాసిరకం పనుల చేసిన కాంట్రాక్టు పై అలాగే ఇంజినీర్ పై చట్టపరమైన చెర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.